- సుమారు 1000 ఎకరాలకు బీడు భూములు 3పంటలకు సాగునీరు అందించిన భగీరథుడు.
- ఆనందం వ్యక్తం చేస్తున్న రైతాంగం
ములకలపల్లి:ఫిబ్రవరి2:₹మన్యం మనుగడ)న్యూస్:
మారుమూల ఏజెన్సీ గ్రామం ములకలపల్లి మండలం పొగళ్లపల్లి లో గల రాజుపేట,పొగళ్లపల్లి,తిమంపేట, గ్రామాల్లో గల గిరిజన,బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద రైతులకు భూములు ఉన్నా సాగునీటి సమస్య తో అనేక ఏళ్ళు కటిక దారిద్రం తో ఇబ్బందులు పడుతున్న రైతులకు భగీరథుడు గా స్వర్గీయ తాండ్ర నారాయణ రావు గారి వారసుడు తాండ్ర వెంకటేశ్వరరావు తాండ్ర నారాయన రావు(TNR) ట్రస్ట్ తరుపున ఈ ప్రాంత రైతాంగంకు సాగానీటి సమస్య పరిష్కారానికి జన్మభూమి కోసం సుమారు 1000 ఎకరాలు భూమికి నిత్యం నీటి తో 3 పంటలు పండించి ఆర్థికంగా అభివృద్ధి చెందుట కోసం సుమారు 25లక్షల రూపాయలతో విద్యుత్ లైన్స్ కోసం విద్యుత్ శాఖ DD లు మరియు తదితర రైతుల ఖర్చులుకోసం ఈ రోజు పొగళ్లపల్లి రైతు వేదిక లో స్థానిక సర్పంచ్ వగ్గల రమణ. వైస్ ఎంపిపి కొడుమురి పుల్లారావు రైతుల చేతులు మీదుగా విద్యుత్ శాఖ అధికారులు కు తాండ్ర వెంకటేశ్వరవు అందించారు.ఈ సందర్భంగా TNR(తాండ్ర నారాయణ రావు) ట్రస్ట్ ఫౌండర్ తాండ్ర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కన్న ఊరుని,కన్న తల్లి తండ్రులు ను నేల తల్లిని మర్చి పోవద్దని. నేటి సమాజంలో ఉద్యోగం,వర్తకం,కంటే వ్యవసాయం చేయడం ద్వారా కూడా ఆర్థికంగా అభివృద్ధి కావొచ్చని అన్నారు. ప్రభుత్వాలు రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాత పద్ధతిలో వ్యవసాయం కాకుండా ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని,మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేసి ఆర్థికంగా అభివృద్ధి కావాలని రైతులు విజ్ఞప్తి చేశారు .మా తండ్రి తాండ్ర నారాయణ రావు అడుగుజాడల్లో నడుస్తానని ఈ ప్రాంత ప్రజలకు వ్యవసాయము విద్యుత్తు త్రాగునీరు విద్య వైదా తదితర అవసరాలకు ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు నా వంతుగా కృషి చేస్తానని తెలియజేశారు .కరెంటు లైన్ ద్వారా రైతులు సాగునీటిని ఉపయోగించుకొని మంచి పంటలు పండించాలని, మూడు పంటలతో కోనసీమ కల్పించేలా పొగల్లపల్లి పరిసరప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ములకలపల్లి మండల రాజకీయ నాయకులు గ్రామస్తులు నరాటి ప్రసాద్,డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వరరావు తాండ్ర ప్రభాకర్ రావు,తాండ్ర చిట్టిబాబు,పాలకుర్తి ప్రసాద్ గజ్జల సందీప్,ఉప సర్పంచ్ రాజశేఖర్ కందుకూరి రాంబాబు,కృష్ణ ,శ్రీను,రత్న భూషణం,వనమా రాజబాబు పంచాయతీ వార్డు మెంబర్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులు అందరూ శాలువా తో వెంకటేశ్వరవు ను ఘనంగా సన్మానించారు.
Post A Comment: