మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోదావరి పరివాహక ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న కలపను స్వాధీనపరుచుకున్న సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే రాయి గూడెం ప్రాంతానికి చెందిన మల్లికార్జున్ రెడ్డి, లక్ష్మారెడ్డి ట్రాక్టర్ల సాయంతో కలపను రాయి గూడెం గోదావరి పరివాహక ప్రాంతం నుండి తరలిస్తుండగా, పక్కా సమాచారంతో అక్కడికి వెళ్ళినా అటవీశాఖ అధికారులు వాటిని స్వాధీనపరచుకొని, కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అటవి క్షేత్ర అధికారి తేజస్వి, డి ఆర్ ఓ అరుణ, అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: