ములకలపల్లి:ఫిబ్రవరి2:(మన్యం మనుగడ)న్యూస్:
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజావ్యతిరేక బడ్జెట్ అని,సంపన్నులకు మేలు చేసే బడ్జెట్ అని,సిపిఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ఈసందర్భంగా మాట్లాడుతూ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రజా సంక్షేమానికి బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం కోత విధించిందని తెలిపారూ.ఉఫాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకే బడ్జెట్ లో ఈ ఆర్థిక సంవత్సరానికి కేవలం 73 వేల కోట్లు రూపాయలు కేటాయించిందని, ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ ముప్పు తొలగిపోలేదని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ దేశంలో కోవిడ్ అత్యవసర సేవలకు కేటయింపులు లేకపోవటం ఆందోళన కలిగించే అంశమని,అంగన్వాడీ కేంద్రాలను అధునిక విద్యా కేంద్రాలుగా తీర్చి దిద్దుతామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు కేటాయింపులు లేవని అన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారమన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని విమర్శించారు.బడ్జెట్ లో మన తెలంగాణ రాష్ట్రనికి కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేసిందని ప్రజలు ఖండించాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో వూకంటి రవికుమార్,నిమ్మల మధు, పోడియం వెంకటేశ్వర్లు,గోపగాని లక్ష్మీ నర్సయ్య,బైరు ప్రసాద్,దుబ్బా వెంకటేశ్వర్లు,గడ్డం వెంకటేశ్వర్లు,వర్సా శ్రీరాములు. కీసరి వెంకట్రావు,కోర్సా వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: