ములకలపల్లి:ఫిబ్రవరి2:(మన్యం మనుగడ)న్యూస్:
మాదారం గ్రామంలో ములకలపల్లి జడ్పీటీసీ సున్నం నాగమణి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం మాట్లాడుతూ నరేంద్ర మోదీ సర్కారు తెచ్చిన 2022 ఈ బడ్జెట్ లో పేద,మధ్యతరగతి,యువతకు,రైతులకు,జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులకు ఏమీ లేదని ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కార్పోరేట్ శక్తులకు కొమ్ముకాసేలా ఉందని,కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయపన్ను శ్లాబులు పది సంవత్సరాల నుంచి పెంచ లేదని, రైతులకు నిరుద్యోగులకు ఎలాంటి మేలులేదని,ఉమ్మడి ఖమ్మం జిల్లా విషయానికొస్తే కొత్తగూడెంలో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు సింగరేణి గనులకు నిధులు కేటాయింపు,భద్రాచలం పుణ్యక్షేత్రానికి పర్యటకంగా గుర్తింపు తెచ్చే లాగా నిధులు కేటాయించలేదని ఆరోపించారు,ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భద్రాచలం-కొవ్వూరు,పాండురంగాపురం నుంచి భద్రాచలం వరకు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో ఎలాంటి నిధులు కేటాయించలేదని ఆరోపించారు.
Post A Comment: