మన్యం మనుగడ, అశ్వారావుపేట:
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశానుసారం
అశ్వారావుపేటలో రింగ్ రోడ్డు సెంటర్ నందు టిఆర్ఎస్ పెద్దలు సొసైటీ చైర్మన్ నూతక్కి నాగేశ్వరావు, సుంకవల్లి వీరభద్రం ఆధ్వర్యంలో రూపాయికి దోశ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ... తెలంగాణ దశ,దిశ మార్చిన ఘనుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వలస ఆంధ్ర పాలనలో ధగా పడ్డా తెలంగాణ నేడు బంగారు తెలంగాణ గా మారిందంటే కేసీఆర్ దూరదృష్టితో సాధ్యం ఐనది అని వారు కేసీఆర్ సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో టీఆరెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ సంపూర్ణ. మోహన్ రెడ్డి,కలపాల శ్రీనివాస్ అల్లాడి రామారావు చిప్పలపల్లి శ్రీను హరి ఎస్ కే బాజీ బాబా శ్యామ్.
అశ్వరావుపేట నియోజవర్గ యువజన నాయకులు మోటూరి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: