వేతనాల పెరుగుదల,కార్మిక చట్టాలు చట్టబద్ధ సౌకర్యాల అమలుకై ఫిబ్రవరి 12 నుండి జరగబోయే నిరవధిక సమ్మె కు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు సిద్ధంగా ఉండాలని, నేడు జరిగే జీఎం ఆఫీసు ధర్నాను జయప్రదం చేయాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.oc2 లో నిరవధిక సమ్మె పోస్టర్ ఆవిష్కరణ చేశారు. కె సి హెచ్ పి,Oc4 లలో జరిగిన మీటింగ్ లో వారు పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఆర్. మధుసూదన్ రెడ్డి, జి.శ్రీనివాస్, వెలగపల్లి. జాన్, నల్లా. రమేష్, రాజబాబు, ఎండీ గౌస్ లు మాట్లాడుతూ సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు గత అనేక సంవత్సరాలుగా వేతనాల పెరుగుదల లేదని చట్టబద్ధ సెలవులు, వైద్య సౌకర్యం, లాభాల బోనస్, ఉద్యోగ భద్రత, కరోనా సెలవులు, కేటగిరీల వారీగా వేతనాలు లాంటి తదితర అనేక సమస్యల పట్ల అడుగడుగునా కాంట్రాక్ట్ కార్మికులను మోసం చేసు డే సింగరేణి యాజమాన్యం నిత్య పని అని విమర్శించారు. కోల్ ఇండియా ఒప్పందం ప్రకారం కాంట్రాక్టు కార్మికులకు రోజుకు 950 రూపాయలు చెల్లించాలి, రాష్ట్ర ప్రభుత్వ జీవో 22 ప్రకారం రోజుకు 736 రూపాయలు ఇవ్వాలి, ఒకటవ కేటగిరి ప్రకారం రోజుకు వెయ్యి ఇరవై ఏడు రూపాయలు చెల్లించాలి, సుప్రీం కోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం ప్రకారం పర్మినెంట్ కార్మికులకు ఇచ్చే వేతనాలు కాంట్రాక్టు కార్మికులకు చెల్లించాలి, ఇవన్నీ కూడా చట్ట ప్రకారమే కానీ సింగరేణి యాజమాన్యం వీటిలో వేటిని అమలు చేయకుండా అసలు సింగరేణి, బొగ్గు పరిశ్రమకు సంబంధంలేని రోడ్స్ మరియు బిల్డింగ్ జీవో ను చట్టవిరుద్ధంగా తెచ్చి రోజుకు కేవలం 437 రూపాయలు మాత్రమే సింగరేణి యాజమాన్యం చెల్లిస్తున్న దని, దీని ఫలితంగా సింగరేణి లో కాంట్రాక్టు కార్మికుడు నెలకు 8 వేల రూపాయల నుండి 22 వేల రూపాయల వరకు నష్ట పోతున్నాడని, ఇదంతా కాంట్రాక్టు కార్మికుల కష్టార్జితం అన్నారు. ఈ పరిస్థితులలో ఈ వెట్టిచాకిరీ, చాలీచాలని జీతాలతో ఎంతకాలం కుటుంబాలను గడుపుదామని, అందుకే అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికు లందరూ ఫిబ్రవరి 12 నుండి జరుగుతున్న నిరవధిక సమ్మెలో పాల్గొని సింగరేణి తో తాడోపేడో తేల్చుకోవాలని, ఇది ఎవరి కోసమో జరుగుతున్న సమ్మె కాదని, మనందరి కోసం జరుగుతున్న సమ్మె అని, ఎవరో వచ్చి చెప్పలేదని ఎదురుచూడకుండా ఎవరికి వాళ్లే పక్క వాళ్లకు చెప్పడం ద్వారా రాజకీయ పార్టీలకు సంఘాలకు అతీతంగా సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులందరినీ ఐక్యం చేసి ఫిబ్రవరి 12 నుండి నిరవధిక సమ్మె లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. నేడు సాయంత్రం మూడు గంటలకు మణుగూరు జిఎం ఆఫీస్ ముందు జరిగే ధర్నాలో కాంట్రాక్ట్ కార్మికులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమం లో జేఏసీ నాయకులు జే. అశోక్, కొమరయ్య, మల్లయ్య, వీ. జానయ్య, వెంకటేశ్వర్లు,సంజీవరావు, రవి, రామకృష్ణ, భద్రం, సీత, ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: