గుండాల ఫిబ్రవరి 3 (మన్యం మనుగడ) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్యారంగానికి కేవలం రెండు శాతం నిధులు కేటాయించడం ఎంతవరకు సమంజసమని కొత్తగూడెం డివిజన్ అధ్యక్షులు ఎనగంటి వంశి వర్ధన్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యారంగానికి కేంద్ర బడ్జెట్లో 10 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 39 లక్షల 43 వేల కోట్ల బడ్జెట్లో కేవలం రెండు శాతం కేటాయించడం బాధాకరమన్నారు. విద్యా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది అన్నారు. తక్షణమే పది శాతం నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు నాయకులు నరేందర్, జబ్బ సురేష్ , విద్యార్థులు లావణ్య , ప్రీతి , సంధ్య , రమేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: