మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని
సమితిసింగారం పంచాయతీ చెందిన కణితి.లలిత రోడ్డు ప్రమాదం లో గాయపడిన విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.వారి అదేశాల మేరకు రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.10,000 రూపాయల ఆర్ధిక సహాయంను మణుగూరు మండల ఎంపీపీ కారం.విజయకుమారి వారి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ,ఆపదలో ఉన్న వారికి రేగా విష్ణు ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ, పొశం.నరసింహారావు,కో ఆప్షన్ సభ్యులు జావీద్ పాషా, మండల ప్రధాన కార్యదర్శి రామిడి రామిరెడ్డి,పార్టీ అధికార ప్రతినిధి మేకల.రవి,తెరాస సీనియర్ నాయకులు రెడ్డి, మండల నాయకులు,పార్టీ కార్యకర్తలు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: