CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పద్మశ్రీ సకిన రామచంద్రయ్యకు సీఎం కేసీఆర్ 1 కోటి రూపాయల పారితోషకం.హర్షం వ్యక్తం చేసిన ఆదివాసీ సంఘాలు..

Share it:

 


మన్యం మనుగడ , పినపాక: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామంలో ఆదివాసి సంఘాల సమావేశంలో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆదివాసీ డోలు వాయిద్యం,"కంచు తాళం- కంచు మేళం" కళాకారుడు సకిని రామచంద్రయ్యకు తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయలు నజరాన, భద్రాద్రి జిల్లా కేంద్రంలో ఇంటి స్థలం కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు, ఆయన కోసం కృషి చేసిన పినపాక శాసన సభ్యులు, ప్రభుత్వ విప్, రేగా కాంతారావు కి అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. అంతరించి పోతున్న ఆదివాసీ కళలను,కళాకారులను గుర్తించి ఇలానే ప్రోత్సహం అందించాలనినాయకులు కోరారు. గత సంవత్సరం పద్మశ్రీ అవార్డు గ్రహీత గుప్సాడీ కనకరాజు కి కూడా ప్రోత్సాహకం ఇవ్వడం అభినందనీయం అని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ఆదివాసీ ఉద్యోగుల

సంఘం మణుగూర్ డివిజన్ అధ్యక్షులు పోలెబోయిన అనిల్ కుమార్, తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు కొమరం వెంకటేష్, ఆదివాసీ ఐక్యవేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోలెం శ్రీను, గొగ్గల కృష్ణ

ఆదివాసీ ఉద్యోగులు సంఘం పినపాక నాయకులు కొమరం కేశవరావు కొమరం రామారావు, కన్వీనర్ సోలం అశోక్, ఆదివాసీ సంఘాల

నాయకులు తోలెం జంపన్న, కలం సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: