CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భోగి పండుగ రోజు విషాద సంఘటన.ఆగి ఉన్న బోగ్గు టిప్పర్ ను ఢీ కొట్టిన కారు.కారు డ్రైవర్ ఎస్కే జానీ మృతి.

Share it:

 



మన్యం మనుగడ ప్రతినిధి ములకలపల్లి:(అన్నపురెడ్డిపల్లి-జనవరి/14):: బోగి పండగ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి,పలువురు కు గాయాలయ్యాయి.అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని గుంపెన గ్రామ పంచాయతీ,గుంపెన కే కాలనీ గ్రామం వద్ద నేషనల్ హైవే రోడ్డు సైడ్ లో ఆగి ఉన్న బొగ్గు టిప్పర్ ను ప్రమాదవశాత్తు కారు ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ ఎస్కె జానీ అక్కడిక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలం, రామచంద్రపురం గ్రామానికి చెందిన విఆర్ఏ మరినీ వాణి,జూలూరుపాడు రెవిన్యూ డిపార్ట్మెంట్ లో పేరా సర్వేర్ గా విధులు నిర్వర్తిస్తున్న తన భర్త ధర్మరాజు,వారి ఇద్దరు పిల్లలు కలిసి ఉదయం నాలుగు గంటల సమయంలో తన నివాసం నుండి కార్ డ్రైవర్ ఎస్కే జానీ తో మహబాద్ జిల్లా, టేకులపల్లి గ్రామం లోని తమ బంధువుల వద్దకు సంక్రాంతి పండగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరారు. గుంపెన కే కాలనీ వద్ద కి రాగానే ప్రమాదవశాత్తు ఆగి ఉన్న 

ఎస్ఆర్ఎల్టి కంపెనీకి చెందిన బొగ్గు టిప్పర్ వెనుక భాగంలో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ ఎస్కె జానీ (35) అక్కడికక్కడే మృతి చెందాడు.కారులో ప్రయాణిస్తున్న రామచంద్రపురం వీఆర్ఏ మారిని వాణి,పిల్లలు మధులత (12),

కోహిల్ శ్రీరామ్ (8),

భర్త ధర్మరాజు (43) లకు తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.లారీడ్రైవర్ దనసరి నవీన్ ను వివరణ కోరగా తను మూత్ర విసర్జన కి వెళ్లడానికి రోడ్డు పక్కన లారీ ఆపి వెళ్లగా, ఆగి ఉన్న లారీ కి వెనక భాగంలో కారు వచ్చి తగిలిందని తెలియజేశాడు.

Share it:

TS

Post A Comment: