మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధిలోని,లక్ష్మీపురం గ్రామం లో స్థానిక యూత్ ఆధ్వర్యంలో మిత్రుని జ్ఞాపకార్థంగా నిర్వహిస్తున్న సతీష్ రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా బూర్గంపహాడ్ మనోజ్ ఎలెవన్ విజేతగా నిలిచింది.ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బూర్గంపహాడ్ మనోజ్ ఎలెవన్-ముసలమడుగు ఆర్ కె ఎలెవన్ జట్లు తలపడ్డాయి. మొదటిగా బ్యాటింగ్ చేసిన ముసలమడుగు ఆర్ కె ఎలెవన్ జట్టు 12.2 ఓవర్ల లో 62 పరుగులు చేసి అలౌట్ అయింది.అనంతరం 63 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బూర్గంపహాడ్ మనోజ్ ఎలెవన్ జట్టు కేవలం 6 ఓవర్ల లొనే 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. బూర్గంపహాడ్ మనోజ్ ఎలెవన్ జట్టులో 4 వికెట్లు తీసిన నాగరాజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత రూ.15,000 రూపాయల నగదుతో పాటు, విజేతగా నిలిచిన బూర్గంపహాడ్ జట్టుకు ట్రోఫీని అందజేశారు.ద్వితీయ స్థానంలో నిలిచిన ముసలమడు ఆర్ కె ఎలెవన్ జట్టుకు స్థానిక సర్పంచ్ సోంపాక నాగమణి రూ.10,000 రూపాయల నగదుతో పాటు రన్నర్స్ గా నిలిచిన జట్టుకు ట్రోఫీని అందజేశారు.
Post A Comment: