గుండాల జనవరి 19 ( మన్యం మనుగడ) గుండాల, ఆళ్ల పల్లి మండలాల్లో ఉన్న కస్తూరిబా పాఠశాల లో ఉన్న ఖాళీ పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి మండల ఎంఈఓ పి కృష్ణయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుండాల మండలం లో ని పాఠశాలలో కుక్కు, స్వీపర్, స్కావెంజర్ విద్యార్హత 7వ తరగతి చదువుకొని ఉంటే చాలు అన్నారు. 18 నుండి 45 సంవత్సరాల లోపు వయసు ఉండాలని ఆయన సూచించారు. ఈ నెల 22 తారీకు చివరి తేదీ అని ఆయన అన్నారు.మండలంలోని నిరుద్యోగ మహిళలు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు
Post A Comment: