మన్యం టీవీ న్యూస్ దమ్మపేట జనవరి ( 28 ) శుక్రవారం ;- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
దమ్మపేట మండలం
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం బి కె ఎంయు 9 వ మండల మహాసభ కొరసా వెంకటేష్ బెల్లం కృష్ణవేణి అధ్యక్షతన దమ్మపేట విప్లవ నగర్ నిర్వహించడం జరిగింది సిపిఐరాష్ట్ర సమితి సభ్యులు ఎస్ డి సలీం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు రేసు ఎల్లయ్య జిల్లా వర్కింగ్ కార్యదర్శి యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికులను చిన్న చూపు చూస్తున్నాయని వ్యవసాయ కార్మికులకు కూలి బంధు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని వ్యవసాయ కార్మికులకు 57 సంవత్సరాలు నిండిన వారికి ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని వ్యవసాయ కార్మికులకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని ఉపాధి హామీ పనులు 200 రోజులు కల్పించాలని 600 వేతనం ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు ఈ సమస్యల మీద అ ప్రభుత్వం స్పందించకుంటే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధం అవ్వాలని ఈ సందర్భంగా తెలిపినారు ఈ కార్యక్రమంలో లో సిపిఐ మండల కార్యదర్శి తంగెళ్ళమూడి శివకృష్ణ రైతు సంఘం జిల్లా నాయకులు పండూరి వీరబాబు ఏ ఐ వై ఎఫ్ జిల్లా నాయకులు ధర్మ మహిళా సంఘం నాయకురాలు జాన్ బి గిరిజన సంఘం జిల్లా నాయకులు కుంజ మాధవ ఏఐటీయూసీ మండల నాయకులు నల్ల ప్రసాదు జాను మొదలగు వారు పాల్గొన్నారు
Post A Comment: