మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, జనవరి 23, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విశ్వ బ్రాహ్మణుల సంఘం ఆద్వర్యంలో ఆదివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో ఇరవై ఐదు మంది పోటీదారులు పాల్గొన్నారు. మొదటి బహుమతి కీర్తి శేషులు తొండపు ప్రమీలాదేవి జ్ఞాపకార్థం మూడు వేల రూపాయలు, సున్నం అక్షిత కు తొండెపు సుబ్బారావు మరియు భాస్వంత్ అందచేసారు. రెండవ బహుమతి కీర్తి శేషులు తుల్లురి వెంకటేశ్వర్లు, కళావతి జ్ఞాపకార్థం, రెండు వేల ఐదు వందల రూపాయలు ముత్యాల తేజస్విని కి తుల్లురి ప్రశాంత్, ప్రవీణ్ అందచేసారు. మూడవ బహుమతి శ్రీమద్విరాట్ ఆటోమోబైల్స్ వారు రెండు వేల రూపాయలు తిప్పర్తి రవిత్రేణి కి అందచేసారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల విశ్వ బ్రాహ్మణుల సంఘం నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Navigation
Post A Comment: