మన్యం మనుగడ వెబ్ డెస్క్:
వంట చెరుకు కోసం అడవికి వెళ్ళిన ములకలపల్లి మండలం సాకివాగు గ్రామ గిరిజన మహిళలపై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దౌర్జన్యాన్ని దాడిని తీవ్రంగా ఖండించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు గుమ్మడి నరసయ్య పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చండ్ర అరుణ అన్నారు శనివారం నాడు ఇల్లందు లో జరిగిన ఆ పార్టీ సమావేశంలో వారు పాల్గొని ప్రసంగించారు ఫారెస్ట్ అధికారుల దాడులు గిరిజన ప్రజలపై రానురాను పెచ్చరిళ్ళుతున్నాయని మహిళలని కూడా చూడకుండా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని పైకెళ్లి గిరిజన ప్రజల పై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నిన్న ములకలపల్లి మండలం సాకి వాగులో గిరిజన ప్రజలు వంట చెరుకు కోసం అడవి కి వెళ్తే వారిని వెంటబడి గాయపరిచారని అంతేకాకుండా ఒక మహిళను వివస్త్రను చేశారని ఇది మానవ సమాజం తలదించుకునే ఘటన అని వారన్నారు ఈ చర్యకు పాల్పడిన ఫారెస్ట్ అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారిని తక్షణమే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు వై సావిత్రి పిడిఎస్యు జిల్లా కార్యదర్శి కంపాటి పృధ్వి శివ శరత్ ముత్తక్క గౌతమి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Post A Comment: