మన్యం వెబ్ డెస్క్:
భద్రాద్రి:- కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు కుమారుడు వనమా రాఘవేంద్రకు రిమాండ్ గడువును మరో 14 రోజులు పొడిగించారు.
ఇవాళ్టితో రిమాండ్ గడువు ముగియడంతో జైలు అధికారులు కోర్టులో వర్చువల్‌గా రాఘవను హాజరుపరిచారు.
కొత్తగూడెం రెండో అదనపు జ్యుడీషియల్ కోర్టులో వాదనలు జరిగాయి.
అనంతరం ఆయనకు ఫిబ్రవరి 4 వరకు రిమాండ్ గడువు పొడిగిస్తున్నట్లు కోర్టు తీర్పు వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఉదంతంలో ప్రధాన సూత్రధారిగా వనమా రాఘవ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
Post A Comment: