మన్యం మనుగడ మంగపేట.
23 - 01- 2022ఆదివారం రోజున ఏజెన్సీ దళితుల సేవా సంఘం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం లో పేద దళిత వర్గాల ప్రజల కోసం మన ముఖ్యమంత్రి కేసీఆర్
దళిత బంధు అనే స్కీం ప్రవేశ పెట్టడం జరిగింది.తెలంగాణ రాష్ట్రం లో ఉన్న 119 నియోజక వర్గాల లో ఉన్న ఎమ్మెల్యే లకు ఈ యొక్క దళిత బంధు వారి పరిధిలోనే పంపిణీ చేయడం జరుగుతుంది. కానీ ఏజెన్సీ సంబంధించిన నియోజకవర్గాల లో ఉన్న ప్రతి కుటుంబ దళితులకు ఖచ్చితంగా దళిత బంధు అమలు జరగాలి. ఎన్నో సంవత్సరాలనుండి అభివృద్ధి పలాలకు నోచుకోకుండా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటూ చదువుకొని పట్టాలు సంపాదించిన కూడా ఉన్న ప్రాంతంలో ఏజెన్సీఅయినందువలన ఉద్యోగాలు లేక, రాక అదే విధంగా 2000 సంవత్సరంలో తీసుకొచ్చిన జి ఓ నెంబర్ -3 వలన దళితుల జీవితాలలో దుర్భర పరిస్థితులు ఏర్పడినవి . 22 సంవత్సరాల భవిష్యత్తు అంధకారం అయినది ప్రతి నియోజకవర్గంలో దళితులు అన్ని విధాలుగా నష్టపొయినారు కాబట్టి మొదటి ధపాలో ఏజెన్సీ దళితులకు దళిత బంధు అమలు చేయాలి ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న దళితులకు 20 లక్షలు ఇచ్చేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ దళితుల సేవా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పరికి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాని డిమాండ్ చేశారు.ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నియోజకవర్గాలలో దళితుల జీవనవిధాన పరిస్థితి అతి ఘోరాతి ఘోరమైన పరిస్థితి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న దళిత బంధు స్కీంని పూర్తి స్థాయిలో అమలు జరిగే విధంగా చేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏజెన్సీ నియోజకవర్గాల ఎంఎల్ఏ లను ఈ సందర్బంగా ఈ సందర్బంగా ఏజెన్సీ దళితుల సేవాసంఘం కోరడం జరిగింది.
Post A Comment: