CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసీ ముద్దు బిడ్డ పద్మ శ్రీ అవార్డు గ్రహీత సకిని.రామచంద్రయ్య ను సన్మానించిన "తుడుందెబ్బ" బృందం.

Share it:

 


మన్యం టీవి, మణుగూరు:

  ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ఆధ్వర్యంలో నేడు 28, జనవరి ,2022 న పద్మ శ్రీ అవార్డు గ్రహీత సకిని.రామచంద్రయ్య గారి స్వగృహం కూనవరం ఆదివాసీ గూడెంలో (తుడుందెబ్బ) రాష్ట్ర ప్రచార కార్యదర్శి అలెం.కోటి మరియు బృందం రామచంద్రయ్య గారిని ఘనంగా సన్మానించారు.

    అనంతరం వారు మాట్లాడుతూ,..జనవరి ,26 సందర్భంగా ప్రకటించిన పద్మ శ్రీ అవార్డు లో రామచంద్రయ్య కు ఈ అవార్డు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం. మారుమూల ఏజెన్సీ ప్రాంతం నుండి ప్రతిష్టాత్మక పురస్కారానికి ఆదివాసీ ముద్దు బిడ్డ ఎంపిక కావడం చాలా సంతోష మన్నరు.


  తన తండ్రి సకిని.ముసలయ్య నుండి ఈ కళను సొంతం చేసుకున్న రామచంద్రయ్య చిన్న వయస్సు నుండే ఆదివాసీల చరిత్రను పూర్తి స్థాయిలో ఆదివాసీ గుడెల్లో వినిపిస్తూ చరిత్ర అంతరించి పోకుండా కాపాడుతున్న ఆదివాసీ కళాకారుడు రామచంద్రయ్య అన్నారు.

    సమ్మక్క సారలమ్మ చరిత్ర ఆదివాసీల చరిత్ర తో పాటు ఆదివాసీ జీవన విధానాలపై తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలోని ఆదివాసీ గుడెల్లో ప్రదర్శనలు చేస్తూ సంస్కృతి, భాష, ఆచార వ్యవహారాలు కాపాడుతున్న ఒకే ఒక్కడు రామచంద్రయ్య అని అభిప్రాయపడ్డారు.


    కోయ భాషలో చరిత్రను అనర్ఘలంగా చెబుతూ చరిత్ర అంతరించి పోకుండా కాపాడుతున్న ఆదివాసీ కళాకారుడు రామచంద్రయ్య కు మరోమారు హృదయ పూర్వక అభనందనలు తెలియజేశారు.


    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారుమూల ఏజన్సీ ప్రాంత ఆదివాసీ రామచంద్రయ్య కి పద్మ పురస్కారం ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వనికి మరియు అందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆదివాసీ సమాజం నుండి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూన్నాం. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు goggela. నారాయణ కరకగూడెం మండల అధ్యక్షులు ఊకే గణేష్, సుతారి వెంకన్న, సోంబాబు, దిశా కమిటీ మద్దెల అన్నపూర్ణ, ఎం. సువర్ణ, మల్లు స్వరూప, శెట్టి హేమలత తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: