చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: మండల వ్యాప్తంగా పకడ్బందీగా ఇంటింటి ఫీవర్ సర్వే జరుగుతుందని తహసిల్దార్ ఉష శారద అన్నారు. శుక్రవారం చండ్రుగొండ పంచాయతీలో ఇంటింటి సర్వేను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రతి ఇంటికి వెళ్లి జ్వరపిడితుల వివరాలను పక్కగా నమోదు చేసుకోవాలని, కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే మెడికల్ కిట్ ఇచ్చి హోంఐసోలేషన్ కు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. కోవిడ్ పరీక్షలు అవసరం అయిన వారికి చేయించాలన్నారు. కొద్దిరోజుల పాటు ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించడంవల్ల కరోనా కట్టడి చేయడం సులభం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సంజీవ రావు, మెడికల్ ఆఫీసర్ రాకేష్, మండల పంచాయతీ అధికారి తోట తులసి రామ్, పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: