మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు రైల్వే గేటు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి,బ్రెయిన్ డెడ్ అవ్వడం తో,అవయవదానంతో ఆరిపోతున్న ఆరుగురికి పునర్జన్మ నిచ్చిన సమితి సింగారానికి చెందిన భానోత్ శ్రీను (33) సంతాప సభ గురువారం మధ్యాహ్నం పైలెట్ కాలనీలోని దుర్గా ఓబి కంపెనీ ప్రాంగణంలో జరిగింది.ఈ సందర్భంగా ఎస్ ఓ పి సమన్వయకర్త కార్మిక నాయకులు ఎస్డి.నాసర్ పాషా మాట్లాడుతూ,శ్రీను మృతి తీరని లోటన్నారు.శ్రీను మృతి తో ఆయన కుటుంబం అనాధలయ్యారన్నారు.భర్త చనిపోయాడన్న పుట్టెడు దుఃఖంలోనూ,ఆయన అవయవాలు దానం చేసి, ఆరుగురికి ప్రాణదానం చేయడం పట్ల శ్రీను భార్య పావని ని మరియు కుటుంబ సభ్యుల ఔన్నత్యాన్ని చేతులు జోడించి,అభినందిస్తున్నామన్నారు.ప్రమాదం ఎంతో క్రూరమైందని,దానికి దయా దాక్షిణ్యాలు ఉండవని ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని,రోడ్డు భద్రత సూత్రాలు పాటించాలని ఆయన కోరారు.దుర్గా కంపెనీ యాజమాన్యం శ్రీను కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు గతంలో ఓబీ కంపెనీలు బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.ఓసి-2,ఓసి-4 రెండు చోట్ల దుర్గా ఓబి వర్కర్స్ కూడా శ్రీను కుటుంబానికి తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు.అనంతరం శ్రీను మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ కార్యక్రమంలో పుచ్చకాయల రవిశంకర్,వాసన్,దీక్షిత్,కోటా పాల్,శ్రావణ్,నాగేశ్వరరావు,కార్మికులు సమ్మయ్య,ఏ.ప్రసాద్, పి.విశ్వనాధ్,రవి,రమేష్,భద్రం ,వీరన్న,రామకృష్ణ,శ్యామ్ కుమార్,వాసు,యుగంధర్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: