CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భారీ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టుల మృతి.

Share it:

 



మన్యం మనుగడ వాజేడు.


ప్రభుత్వ నిషేధిత సి.పి.ఐ మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ వారు తెలంగాణ-ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో పెద్ద మొత్తంలో గూమికుడి రాజకీయ నాయకులను, సర్పంచ్ లను కాంట్రాక్టర్ లను అపహరించి వారిని చంపాలనే ఉద్దేశ్యంతో పథకం పన్నుతున్నారనే ఖచ్చితమైన సమాచారం మేరకు, తేది: 16.01.2022 నాడు తెలంగాణ-ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర పోలీస్ ప్రత్యేక బలగాలు సిఆర్ పి ఎఫ్ పార్టీలతో కలిసి తెలంగాణ-ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర సరిహద్దు జిల్లాలు అయిన ములుగు-బిజాపుర్ సరిహద్దు అటవీ ప్రాంతం అయిన కర్రె గుట్టల ఏరియాలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ జాయింట్ ఆపరేషన్ కు బయలుదేరి వెళ్ళి కూంబింగ్ నిర్వహిస్తుండగా, ఈ రోజు అనగా తేది: 18.01.2022 నాడు ఉదయకాల సమయంలో కర్రె గుట్టల అటవీ ప్రాంతంలో ప్రభుత్వ నిషేధిత సి.పి.ఐ మావోయిస్ట్ పార్టీ వారికి పోలీస్ పార్టీలకు మధ్య ఎదురుకాల్పులు జరిగినవి. కొంత సమయం తర్వాత ఎదురు కాల్పులు ఆగిపోగా, పోలీస్ పార్టీ వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆ ప్రదేశలంలో వెతకగా (2) మగ మావోయిస్ట్ మృతదేహాలు, (1) మహిళా మావోయిస్ట్ మృతదేహం మరియు వాటి ప్రక్కనే ఎస్ ఎన్ ఆర్ రైఫిల్-01, ఐ ఎం ఎస్ ఐ ఎస్ రైఫిల్- 01, సింగిల్ బోర్- 01, రాకెట్ లాంచర్- (10) ఇతర కిట్ సామాగ్రి లభించినవి. ఇట్టి ఎదురు కాల్పులలో పోలీస్ పార్టీలో నుండి ఒకరు బులెట్ గాయంతో గాయపడినారు.

Share it:

TS

Post A Comment: