CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఒమిక్రాన్‌ విస్తరిస్తుందన్న ప్రజలు అప్రమత్తంగా వుండాలి .ఏడుల్లా బయ్యారం సీఐ బూర రాజగోపాల్

Share it:


 

మన్యం మనుగడ, పినపాక:

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ విస్తరిస్తుందన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఈ.బయ్యారం రాజ గోపాల్ మండల ప్రజలకు సూచించారు. 

ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఓమి క్రాన్ వ్యాప్తిని నియంత్రించడం లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను ప్రతి ఒక్కరూ.. భాధ్యతగా పాటించాలని పెర్కొన్నారు. 

ప్రతీ ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించాలన్నారు.

కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని సూచించారు.

బహిరంగ ప్రదేశాలలో మాస్క్ దరించని వారికి విపత్తు నిర్వహణ చట్టం క్రింద 1000/- రూపాయల జరిమానా విధిస్తామని, సంస్థల పై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

 ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల మేరకు ర్యాలీలు, బహిరంగ సభలు, ఇతర సామూహిక సమావేశాలు పూర్తిగా నిషేధమని,ప్రజా రవాణా నిర్వహణ సంస్థలు, షాపులు, మాల్స్, సంస్థలు, కార్యాలయాలలో కూడా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సూచించారు. ఆంక్షలను పాటించి పోలీస్ వారికి సహకరించాలని ప్రజలను కోరారు.

Share it:

TS

Post A Comment: