CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.

Share it:

 


మన్యం మనుగడ, దుమ్ముగూడెం:

                         అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

దుమ్ముగూడెం మండలం లక్ష్మినగరం గ్రామంలో గత నెల తేది 14.12.2021. రాత్రి సమయంలో SBI బ్యాంకు నందు కొంత మంది దొంగలు వెనుక నుండి లోపలికి ప్రవేశించి బ్యాంకు నందు గల CC కేమేరాలను అలారం సిస్టం వైర్స్ కత్తిరించి స్ట్రాంగ్ రూమ్ లోపలికి వెళ్లి లోపల గల డబ్బులు వున్న సేఫ్ లాకర్ ను గ్యాస్ కట్టర్ సహాయంతో పగలగొట్టి అందులో వున్న 19,35,650/- రూపాయలు నగదు మరియు CC కేమేరాలను హార్డ్ డిస్క్లను దొంగతనం చేయడం జరిగింది. ఇట్టి పిర్యాదు SBI బ్యాంకు మేనజర్ ద్వారా అందగా, దుమ్ముగూడెం CI వెంకటేశ్వర్లు గారు కేసు నమోదు చేసి, వారీ సిబ్బందితో కలిసి దొంగలను గురించి, వారు ఉపయోగించిన వాహనం గురించి వెతుకుతుండగా లక్ష్మినగరం గ్రామం నందు ఏర్పాటు చేసిన CC కేమేరాల ద్వారా మరియు భద్రాచలం నందు వున్న CC కేమేరాల ఆదారంగా లక్ష్మినగరం గ్రామం వైపు వచ్చినటువంటి వాహనాలను, వాహనాల వివరాలను తెలుసుకొని అట్టి వాహనాలలో AP 28 AZ 6678 నెంబర్ గల మహీంద్రా స్కార్పియో తరుచుగా లక్ష్మినగరం వచ్చి వెళ్ళడంతో అనుమానంతో అట్టి వాహనాన్ని పట్టుకోనుటకు గాను SP సునీల్ దత్ గారు, ASP అక్షాంష్ యాదవ్ అదేశాల మేరకు 4-బృందాలుగా విడిపోయి అట్టి వాహనం గురించి వెతుకుతుండగా అట్టి వాహనం చింతూర్ మీదుగా భద్రాచలం వైపు వస్తునదనె సమాచారంతో దుమ్ముగూడెం CI వెంకటేశ్వర్లు, CCS-CI పుల్లయ్య , SI రవి కుమార్, మరియు సిబ్బందితో భద్రాచలం చేరుకొని గాలిస్తుండగా కూనవరం రోడ్ లో అట్టి వాహనాన్ని ఆపి వాహనాన్ని తనిఖీ చేయగా అట్టి వాహనంలో 7 గురు మగ వ్యక్తులు, రెండు గ్యాస్ సిలిండర్స్, గ్యాస్ కట్టర్స్ మరియు గోడలను పగలకోట్టె బలమైన సామాగ్రిలు ఉండటంతో వారిని విచారించగా వీరందరూ ఉత్తరప్రదేశ్,మహరాష్ట్ర రాష్ట్రాలకు చెందినవారు గాను వారీ పేర్లు (01).నవాబుల్ హసన్ (02).మహమూద్ నవాబ్ హసన్ ఖాన్, (03).రాజు వసంత రావు వర్బే (04). సాదిక్ అలీఖాన్, (05).మహమూద్ మహకూమ్, (06). యూసఫ్ ఖాన్, (07). ఇంతిఖాబ్ ఖాన్ అని మేమంతా గత మూడు సంవత్సరాలుగా మహారాష్ట్ర రాష్త్రంలోని చంద్రపూర్ జిల్లాలో-2 దొంగతనాలు, బాంద్రా జిల్లాలో-5 దొంగతనాలు, గొండియా జిల్లాలో- 2 దొంగతనాలు మరియు మద్యప్రదేశ్ రాష్త్రంలోని సైదాల్ జిల్లాలో-2 దొంగతనాలు, చిన్వర జిల్లాలో-1 దొంగతనం ఇలా బ్యాంకులలో, ATMలలో, షాప్ లలో చాల దొంగతనాలు చేసామని గత సంవత్సరం మార్చి లో తెలంగాణా లో పెద్దపల్లి జిల్లా, మంథని మండలం గుంజపడుగు SBI బ్యాంకులో దొంగతం చేసామని, అక్కడి పోలీస్ వారు పట్టుకొని అరెస్ట్ చేయగా జైలుకి వెళ్లి విడుదల అయ్యి బయటికి వచ్చాము. తర్వాత మళ్ళి 2021 డిసెంబర్ 5 తేదిన అషిఫాబాద్ ఏరియ లో అడ గ్రామంలో SBI Bank లో 8Lakhs దొంగతనం చేసినామని చెప్పి , డిసెంబర్ 14 నా రాత్రి సమయంలో దుమ్ముగూడెం మండలం లక్ష్మినగరం గ్రామంలో SBI Bank ను మేమే దొంగతనం చేసి సుమారుగా 19 లక్షల రూపాయలు దొంగిలించినామని , దొంగిలించిన డబ్బులో కొంత డబ్బును మాలో ఒక వ్యక్తి అయిన ల-ఎక్ ఉజ్జమా @ టిన్ను కు ఇచ్చి ఉత్తరప్రదేశ్ కు పంపినామని మా ఖర్చులకు గాను ఉంచిన డబ్బులలో కొంత కర్చు చేయగా మిగిలిన డబ్బు ఇదేనని చెప్పగా పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి వారీ వద్ద నుండి 3లక్షల 10 వేల రూపాయలు మరియు 9 మొబైల్ ఫోన్స్ ను , AP 28 AZ 6678 నెంబర్ గాల స్కార్పియో కార్ ని, గ్యాస్ కట్టర్స్ , గ్యాస్ సిలిండర్స్ సామాగ్రిలను స్వాధీనం చేసుకొని అట్టి 7 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. త్వరితగతిన దొంగలను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్న దుమ్ముగూడెం CI వెంకటేశ్వర్లు, CCS- CI పుల్లయ్య, SI రవి కుమార్, ASI సత్యనారాయణ, HC’S సురేష్, శంకర్, IT CORE సిబ్బంది మరియు స్టేషన్ సిబ్బందిని SP గారు మరియు ASP గారు అబినందించారు.

Share it:

TS

Post A Comment: