గుండాల జనవరి 22న (మన్యం మనుగడ) పి డి ఎస్ యు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది అని పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన రాజేష్ అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. నూతన కార్యవర్గం లో నాతో పాటు మరో ఇద్దరిని జిల్లా కమిటీ లోకి తీసుకోవడం జరిగిందన్నారు. తరుణ్ , రామకృష్ణ లను జిల్లా కమిటీ లోకి తీసుకోవడం జరిగిందన్నారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణపై చర్చించామని ఆయన పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలన్నారు. కరోనా పేరుతో విద్యాసంస్థలను మూసివేయడం సరైంది కాదని వాటిని తేవాలన్నారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని అన్నారు. విద్యార్థుల సమస్యలపై తమ్ముడు ముందుండి పోరాడుతామని అన్నారు
Post A Comment: