CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పార్టీ ప్రతిష్టాత్మకంగాచేపట్టిన డిజిటల్ సభ్యత్వం నమోదుకు గ్రామాలలో విశేష స్పందన.

Share it:

 


మన్యం మనుగడ మంగపేట.

మంగపేట మండలం జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మైల జయరాం రెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులు మండలంలో అన్ని గ్రామాలు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ సభ్యత్వ నమోదు వివరాలు సేకరిస్తూ రాష్ట్రంలో జిల్లాను ముందు వరుసలోనిలబెట్టాలని అన్నారు. జిల్లాలో మంగపేట మండలం మొదటి స్థానం ఉంచాలని కోరుతూ ప్రతి ఇంటికి ఒకరు చొప్పున కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నమోదు చేసుకోవాలని సభ్యత్వ నమోదు చేసుకున్నవారికి ప్రమాద బీమా రెండు లక్షలు వర్తిస్తుందని ప్రమాదంలో ఏదైనా అవయవం కోల్పోయినచో ప్రమాద బీమా వర్తిస్తుందని ఈ అవకాశాన్ని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి అన్నారు. అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ సభ్యత్వం నమోదు కు గ్రామాలలో విశేష స్పందన లభిస్తుందని ఈ సందర్బంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు పూజారి సురేంద్రబాబు మండల ఉపాధ్యక్షులు తూడి భగవాన్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శులు అయ్యోరీ యానయ్య మైపా లాలయ్య బీసీ సెల్ మండల అధ్యక్షుడు ముత్తినేని ఆదినారాయణ బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చిలకమర్రి శ్రీనివాస్ చెన్నపెల్లి రాంబాబు మైల మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: