మన్యం మనుగడ వెబ్ డెస్క్:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవలే ప్రకటించిన దళిత బందు కార్యక్రమం మాటలకే పరిమితమై పోయిందని కాంగ్రెస్ పార్టీ పాల్వంచ మండల అధ్యక్షులు గద్దల రమేష్ అన్నారు.
ఈ మేరకు శుక్రవారం రమేష్ ఓ ప్రకటలో తెలిపారు. ముఖ్యమంత్రి ప్రకటించిన దళిత బంధు పథకాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాల్వంచ మండలం లో ఉన్న ప్రతి ఒక్క దళిత కుటుంబానికి దళిత బందు ప్రకటించి ముఖ్యమంత్రి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత కుటుంబాలన్నీOటీని సమగ్ర సర్వే నిర్వహించి పకడ్బందీగా ఈ పథకం అమలు చేయాలని కోరారు. కేవలం ఎన్నికల కోసం హుజురాబాద్లో ప్రకటించినట్టు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దళిత బందు వెంటనే అమలు చేయాలన్నారు. ఈ మధ్య కాలంలో
మరో నాలుగు మండలాలకు తూతూమంత్రంగా ప్రకటించారని ఆరోపించారు. ఇకనైనా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయకపోతే త్వరలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
Post A Comment: