మన్యం మనుగడ మంగపేట.
మండల పరిధిలోని రమణక్కపేటలో మాలమహానాడు ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చినరోజు దేశం యావత్తు జాతీయ పండుగ మువ్వన్నెల జెండా ఎగురవేసి ఎంతో ఆనందం తో ఈ వేడుకనుజరుపుకుంటున్నాం అదేవిధంగా ఈ స్వతంత్ర ఫలాలు అందించుటకు తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టిన మహానుభావులు, తన జీవితం మొత్తం దేశం కోసమే ఆరాట పడిన డా:బి ఆర్ అంబేద్కర్ లాంటి మహనీయులను ఈ సందర్బంగా స్మరించుకోవాలి అంతే కాదు అంబేద్కర్ ఆశయ సాధనకోసం ప్రతి పౌరుడు కృషి చేయాలి అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుక వెళ్లి తద్వారా ప్రజలను చైతన్య పర్చాలి.భారత రాజ్యాంగం రాసి భారత దేశానికి భారత పౌరులకు దిశా నిర్దేశం చేసిన మహానుభావుడు డా:బి ఆర్ అంబేద్కర్ ఆయన ఎల్లప్పుడు మనకు చిరస్మరణీయులు మార్గ దర్శి అని ఈ సందర్బంగా తెలియచేశారు. ఈ కార్యక్రమం లో మాల మహానాడు మండల నాయకులు మంచాల నాగేంద్రబాబు గంగేర్ల శ్రీనివాస్ గాజా నరసింహరావు జానపట్ల జయరాజు చెట్టుపల్లి స్నేహకుమార్ గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: