మన్యం మనుగడ ములుగు.
సంక్రాంతి పర్వదిన సందర్భంగా తాడ్వాయి మండలంలోని రంగాపురం అభ్యుదయ యూత్ ఆధ్వర్యంలో 5 మండలాల స్థాయి క్రికెట్ నిర్వహించగా 30 జట్లు పాల్గొన్నాయి.
బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కరకగూడెం మండలంలోని చొప్పాల జట్టు పై తాడ్వాయి సమ్మక్క సారక్క మండలంలోని తాడ్వాయి జట్టు ఘన విజయం సాధించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ ఇర్ప ఆశ్విని-సూర్యనారయణ పాల్గొని మాట్లాడుతూ...
యువత ఎంచుకున్న రంగాల్లో రాణించి, తల్లితండ్రులకు,సమాజానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
మొదటి బహుమతి తాడ్వాయి జట్టుకు తెరాస గ్రామ కమిటీ అధ్యక్షులు ఇర్ప రామకృష్ణ,రెండోవ బహుమతి చొప్పాల జట్టుకు స్థానిక సర్పంచ్ ఇర్ప ఆశ్విని-సూర్యనారయణ విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచు జవ్వాజి మోహన్ రావు,ఇర్ప నాగేశ్వర రావు(టీచర్) ,ఇర్ప ఎర్రయ్య,కరకగూడెం మండల తెరాస యువజన విభాగం అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్,అభ్యుదయ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: