- అటవీ ఉత్పత్తులు పై ఆదివాసీ లకు సంప్రదాయ హక్కు ఉన్నది.
- సీపీఐ రాష్ట్ర నేత నరాటి డిమాండ్
- ములకలపల్లి అమానుష సంఘటపై ప్రభుత్వం స్పందించాలి.
ములకలపల్లి:మన్యం మనుగడ (న్యూస్)మండల పరిధిలోని సాకివాగు గ్రామంలో ముగ్గురు మహిళలపై ఫారెస్టు అధికారి,సిబ్బంది ప్రవర్తించిన తీరు అమానుషమని,ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి, భాద్యులపై కఠిణ చర్యలు తీసుకోవాలని సిపిఐరాష్ట్ర సమితి సబ్యలు నరాటి ప్రసాద్ డిమాండ్ చేశారు. ములకలపల్లి లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ సాకి వాగు ఆదివాసీ గిరిజనులపై జరిగిన హేయమైన సంఘటనపై స్పందింస్తూ, అడవులపై ఆదివాసీ గిరిజనులపై పూర్తి హక్కు ఉందని అటవీ హక్కుల చట్టం 2005 చెపుతున్నా ఈ చట్టానికి పాలకులు తూట్లు పొడుస్తున్నారన్నారని,అడవులే జీవనాదారంగా జీవిస్తున్న ఆదివాసీ గిరిజనులను ఆ అడవుల నుంచి దూరం చేసే విదంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని,అటవీ అధికారులను,పోలీసులను ఉసిగొల్పుతూ దాడులకు ప్రోత్సహిస్తోందని విమర్శించారు. సాకివలస గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన మహిళలు పెట్టి లక్ష్మి, సోడె దేవమ్మ,సోడె రజనీలో కట్టేపుల్లల కోసం అడవిలోకి వెల్లడం వారు చేసిన పాపమా అని ప్రశ్నించారు.గిరిజనులు అడవులను తమ జీవనాదారంగా భావిస్తారేగాని వాటిని నాశనం చేసే ఉద్దేశం ఉండదని,కలప స్మగ్లర్లు, భూస్వాములకు పరోక్షంగా సహకిరిస్తూ అమాయ గిరిజనులపై తమ ప్రతాపం చూపడం అటవీ అధికారులకు తగదని,ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాదితులకు న్యాయం చేయాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ ఉన్నతాధికారులతోపాటు, సంబందిత శాఖ మంత్రికి వినతిపత్రం పంపినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మండల కో ఆప్షన్ సభ్యులు జబ్బార్,సీపీఐ మండల సహాయ కార్యదర్శి నరాటి రమేష్,నాయకులు కీసరి గంగరాజు,వీరు నాయక్. ఈమనియల్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: