మన్యం మనుగడ, ములకలపల్లి:
భద్రాద్రి కొత్తగూడెం ములకలపల్లి మండలం రాచన్న గూడెం గ్రామపంచాయతీ సాటి వలస గ్రామ మహిళలపై దాడి చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని, ఉద్యోగం నుండి తొలగించాలని ములకలపల్లి మండల కేంద్రంలో ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ (ఎం-ఎల్ )న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఆవునూరి మధు ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ముద్ద బిక్షం, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల జడ్పిటిసి వాగాబోయిన రామక్క, ఎస్కే ఉమర్, యా సారపు వెంకన్న, ఏ రాము, నూప భాస్కర్, కల్లూరి కిషోర్, పోతుగంటి లక్ష్మణ్, కుంజ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: