CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముత్యాలసాగర్ కు ఘనంగా నివాళులు అర్పించిన వివిధ ప్రజా సంఘాలు.

Share it:

 


మన్యం మనుగడ మంగపేట.

 మంగపేట మండలం కమలాపురం గ్రామంలో వివిధ ప్రజా సంఘాలు మరియు కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కమలాపురం అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇటీవల నిరుద్యోగి ఆత్మ హత్య చేసుకున్న ముత్యాలసాగర్ ఆత్మ శాంతి కోసం కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు.ఏజెన్సీ ప్రాంతంలో పుట్టి ఇక్కడే పైచదువులు చదువు కొని కూడా ఉద్యోగాలు రాక,ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వక ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల ప్రాణాలు కోల్పోవటానికి కారణం అవుతుంది.ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి నిరుద్యోగ విద్యార్థుల కోసం కాళీగా ఉన్న ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యాశాఖ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టి విద్యార్థుల జీవితాలను మారుస్తాం అంటున్న ప్రభుత్వం ముందుగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలనే సోయి తెచ్చు కోవాలన్నారు. ఆధరబాదరగా కొత్త జిల్లాలు ప్రకటించి కొత్త జిల్లాల వ్యాప్తంగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ప్రజలను విద్యార్థుల ను మభ్యపెట్టాలని చూస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు అని తెలియజేశారు ఈ సారి ఏజెన్సీ నివసించే నిరుద్యోగ విద్యార్థుల కూడా ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు . ఉద్యోగం రాక ఆత్మ హత్య చేసుకున్న ముత్యాల సాగర్ కు ఇప్పుడు అయినా న్యాయం జరగాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముత్యాల సాగర్ కుటుంబలోని ఒకరికి ఉద్యోగం కల్పించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఎస్సి బీసీ ఓసీ మరియు మైనార్టీల పక్షాన పరికి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లికొండ యాదగిరి, మున్నూరు కాపు కమలపురం గ్రామ అధ్యక్షుడు తలారి గోపి,గ్రామ కార్యదర్శి సురేష్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు తుడి భగవాన్ రెడ్డి, గ్రామ ఉపాధ్యక్షుడు తోట అశోక్, మండల కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ అధ్యక్షుడు మూతినేని ఆదినారాయణ బిజెపి ములుగు జిల్లా కార్యవర్గ సభ్యుడు రాంమిడి సురేస్ కమ్మ సంఘం రాజుపేట గ్రామ కమిటీ సభ్యులు కందిమల్ల వెంకటేశ్వరవు మంగపేట మండల యం. ఆర్.పి.ఎస్ మండల అధికార ప్రతినిధి గాజర్ల రాజుమాదిగ వంకాల నాగేశ్వరరావు.కాపు సంఘం సభ్యులు గుమ్మడి సురేందర్ మరియు వివిధ కులాల నాయకులు వ్యక్తులు పాల్గొని ముత్యాల సాగర్ కు ఘనంగా నివాళులు అర్పించారు.

Share it:

TS

Post A Comment: