గుండాల జనవరి 21(మన్యం మనుగడ) మిషన్ భగీరథ గ్రిడ్ అధికారుల వైఫల్యం వల్లనే మండలంలోని గ్రామాలకు మిషన్ భగీరథ మంచి నీరు అందటం లేదని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గ్రిడ్ ఏఈ వీరబాబు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పర్యటనలో భాగంగా కన్నాయిగూడెం గ్రామంలో గ్రామస్తులు మిషన్ భగీరథ మంచినీళ్లు రావడంలేదని ఎమ్మెల్యే రేగా కాంతారావు కు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించిన రేగా అక్కడే ఉన్న ఏ ఈ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేతకాకపోతే ఇంటికి వెళ్లాలి తప్ప పనిలో అలసత్వం వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని అన్నారు. మరో రెండు రోజుల్లో మంచినీరు అందించాలని ఏ ఈ వీరబాబు ను ఆదేశించారు
Post A Comment: