మన్యం టీవీ ,మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం కల్యాణ పురం గ్రామంలో శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతుల మీదుగా భూమి పూజ చేసి, పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశం గర్వించదగ్గ ప్రపంచస్థాయి మేధావి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కొనియాడారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్ తన జీవితం,వ్యక్తిత్వం ద్వారా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు.దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిది అని,బడుగు,బలహీనవర్గాల అభ్యున్నతకి రిజర్వేషన్లు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు అని కొనియాడారు.ప్రతి ఒక్కరు డాక్టర్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలని,నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని,నవ సమాజ నిర్మాణం లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ మేరకు కళ్యాణపురం గ్రామంలో పర్యటనకు విచ్చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు కు ఘాన స్వాగతం పలికి,శాలువాతో సన్మానించి, చిత్ర పటాన్ని అందజేశారు.ఈ కార్యక్రమం లో అశ్వాపురం మండలం ప్రజా ప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేంధర్,నియోజకవర్గ ఎస్సి విభాగం అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్,నియోజకవర్గ యువజన ఉపాధ్యక్షులు లంకెల రమేష్,పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు,సోషల్ మీడియా సభ్యులు, అభిమానులు,స్థానిక ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: