మన్యం మనుగడ దుమ్మగూడెం: మండలంలోని ములకపాడు సెంటర్ లో రైతు విద్రోహ దినాన్ని పాటించిన ప్రజాసంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఆధ్వర్యంలో దుమ్మగూడెం లో ప్లే కార్డు పట్టుకొని నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమంరైతు ఉద్యమం విరమణ సందర్భంలో రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని. ఉద్యమంలో మరణించిన రైతు అమరవీరులకు నష్ట పరిహారం చెల్లించాలని. లఖింపూర్ నిందితులను కఠినంగా శిక్షించాలని. మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకురావాలని. నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని నినాదాలు చేశారు.రైతుల పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని. రైతుల పండించిన పంటలకు మద్దతు ధర ల గ్యారంటీ చట్టం తేవాలని. నిత్యావసర సరుకులు ధరలనునియంత్రించడానికి.నూతనంగా తీసుకుని వచ్చిన విద్యుత్తు బిల్లు ను రద్దు చేయాలని ప్రజా సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వం ని డిమాండ్ చేశారు కేంద్రం లో బిజెపి రెండవ సారి అధికారంలో కి వచ్చిన తరువాత రైతుల పై కార్మికుల పై మహిళల పై ప్రభుత్వ రంగ సంస్థ లను ప్రవేటు ఫారం చేయడం లాంటి ప్రయోగాలని మానుకోవాలని దేశంలో ఉన్న కార్మికులు కర్షకులు అందరూ ఏకం కావాలని వారు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో టి ఏ జి ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు కారం పుల్లయ్య. వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వంశీకృష్ణ సి ఐ టి యు జిల్లా ట్రెజరర్ జి పద్మ రైతు సంఘం మండల అద్యక్షుడు శ్రీను బాబు . సిఐటియు మండల కన్వీనర్ కొరస చిలకమ్మ . వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు మర్మం చంద్రయ్య. యం డి మహ్మద్ బేగ్. కల్లూరి లక్ష్మయ్య.వెంకటేశ్వర్లు.ఉబ్బా లక్ష్మయ్య. సీతారామయ్య. తదితరులు పాల్గొన్నారు
Post A Comment: