CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు- శ్రీ వివేకానంద కంప్యూటర్ ఎడ్యుకేషన్ లో ఘనంగా నిర్వహణ- విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ.

Share it:

 


మన్యం మనుగడ,పినపాక:

స్వామి వివేకానంద జయంతిని బుధవారం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గల స్వామి వివేకానంద కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్య్రకమానికి ముఖ్య అతిథిగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లింగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేకానంద కంప్యూటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ రామ్ బృహస్పతి స్వామి వివేకానందుని చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంచి పెట్టి, వివేకానంద పుస్తకాలను ఉచితంగా అందజేశారు. అనంతరం శ్రీ రామ్ బృహస్పతి మాట్లాడుతూ స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని అన్నారు.ప్రపంచానికి స్పూర్తి నిచ్చిన ఆధ్యాత్మికవేత్త అని,హిందుత్వం గురించి ప్రపంచానికి చాటిచెప్పిన ముఖ్యవ్యక్తి స్వామి వివేకానంద అని అన్నారు. యువకులు దేశానికి పట్టుకొమ్మలుగా ఉండాలని, నిరుత్సాహం, నిస్ప్రుహ, ఉన్నట్లైతే ఆ వ్యక్తులు ఎందుకు కొరగారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యదర్శి సంతోష్, ఉపాధ్యక్షులు బొడా లక్ష్మణ్, వెంకటేశ్వర్లు, యాకయ్య, గొడిశాల చంద్రం, అనుమాటి వెంకటేశ్వర్లు, నివేదన్,కొప్పుల సంపత్, తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: