- ఆదివాసీలకు అడవులకు వెళ్లే అర్హత లేదా..?
- ఘటనపై సమగ విచారణ జరిపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా డిమాండ్..
మన్యం టీవీ న్యూస్ : కొత్తగూడెం, (కొత్తగూడెం నియోజకవర్గ కోఆర్డినేటర్ సంఘం నాగరాజు) జనవరి 22, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండల పరిధిలోని సాకివలస గ్రామంలో ముగ్గురు ఆదివాసీ గిరిజన మహిళలపై ఫారెస్టు సిబ్బంది ప్రవర్తించిన తీరు అమానుషమని, ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించిఠ భాద్యులపై కఠిణ చర్యలు తీసుకోవాలని, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా డిమాండ్ చేశారు. సాకివలస ఆదివాసీ గిరిజనులపై జరిగిన హేయమైన సంఘటన పై స్పందింస్తూ శనివారం స్థానిక శేషగిరిభవన్ లో మాట్లాడారు. అడవులపై ఆదివాసీ గిరిజనులకు పూర్తి హక్కు ఉందని, అటవీ హక్కుల చట్టం 2005 చెపుతున్నా ఈ చట్టానికి పాలకులు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. అడవులే జీవనాదారంగా జీవిస్తున్న గిరిజనులను ఆ అడవుల నుంచి దూరం చేసే విదంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, అటవీ అధికారులను, పోలీసులను ఉసిగొల్పుతూ దాడులను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. సాకివలస గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన మహిళలు పెట్టి లక్ష్మి, సోడె దేవమ్మ, సోడె రజనీలు కట్టె పుల్లలకోసం అడవిలోకి వెల్లడం వారు చేసిన పాపమా అని ప్రశ్నించారు. గిరిజనులు అడవులను తమ జీవనాదారంగా భావిస్తారేగాని, వాటిని నాశనం చేసే ఉద్దేశం ఉండదన్నారు. కలప స్మగ్లర్లు, భూస్వాములకు పరోక్షంగా సహకరిస్తూ.. అమాయ గిరిజనులపై తమ ప్రతాపం చూపడం అటవీ అధికారులకు తగదన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాదితులకు న్యాయం చేయాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అటవీ ఉన్నతాధికారులతోపాటు, సంబందిత శాఖ మంత్రికి వినతిపత్రం పంపినట్లు తెలిపారు.
Post A Comment: