CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నాటకీయపరిణామాల మధ్య రాఘవ అరెస్ట్.

Share it:

 


మన్యం వెబ్ డెస్క్:

పాల్వంచ:నాటకీయ పరిణామాల మధ్య వనమా రాఘవ అరెస్ట్ జరిగింది.పాత పాల్వంచ కు చెందిన మండీగ రామకృష్ణ కుటుంబం ఈ నెల 3న ఆత్మహత్య చేసుకుంది. రామకృష్ణ సెల్ఫీ వీడియో లో రాఘవ వల్లే తాము బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు పేర్కొనడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది.సెల్ఫీ వీడియో బయటకొచ్చినప్పటి నుండి రాఘవ పరారీలో ఉన్నాడు.అప్పటి నుండి సబ్ డివిజన్ పోలీసులు రాఘవ కోసం 8 బృందాలతో రెండు రాష్ట్రాల్లో విస్తృత గాలింపు చేపట్టారు.శుక్రవారం రాత్రి 11:50 కి దమ్మపేట లో అక్కడి ఎస్సై అదుపులోకి తీసుకున్నారు.రాఘవ అరెస్ట్ నాటకీయంగా జరిగిందనే ప్రచారముంది.


వైద్య పరీక్షల అనంతరం..


శనివారం తొలుత వనమా రాఘవను పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలలో సూపరింటెండెంట్ డాక్టర్ ముక్కంటేశ్వర్రావు వైద్య పరీక్షలు నిర్వహించారు.అనంతరం ఏ ఎస్ పీ కార్యాలయం కు తరలించారు.


12 కేసుల్లో రాఘవ నిందితుడు..

:ఏ ఎస్ పీ రోహిత్


వనమా రాఘవ ఇప్పటికి 12 కేసుల్లో నిందితుడిని ఏ ఎస్ పీ రోహిత్ రాజు తెలిపారు.ఏ ఎస్ పీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీ ఐ సత్యనారాయణ, ఎస్సైలు ప్రవీణ్, రతీశ్ లతో కలిసి మాట్లాడారు.ఇప్పటికే రాఘవ పై రిజిస్టర్ అయిన కేసులపై సమగ్ర విచారణ చేస్తున్నామన్నారు.రామకృష్ణ బామ్మర్ది జనార్దన్ పిర్యాదు మేరకు 3న జరిగిన కుటుంబ ఆత్మహత్య ల నేపథ్యంలో వనమా రాఘవ,మండిగ సూర్యవతి,కొమ్మిశెట్టి మాధవి లపై 302,306,307 సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసినట్లు ఏ ఎస్ పీ చెప్పారు.రాత్రి దమ్మపేట వద్ద నెక్షన్ కార్ నం:TS28L0001 హైద్రాబాద్ వెళ్తుండగా దమ్మపేట ఎస్సై ఆధ్వర్యంలో ముందస్తు బృందాలు అదుపులోకి తీసుకున్నామన్నారు.రాఘవ తో పాటు ముక్తేవి గిరీష్,డ్రైవర్ కొమ్ము మురళి లను అరెస్ట్ చేశామన్నారు.


 కేసులో నిందితులు వీరే..


 ఏ1) మండిగ నాగ రామకృష(మృతుడు),ఏ2)వనమా రాఘవేంద్రరావు@రాఘవ(అరెస్ట్),ఏ3) ఎం సూర్యవతి(పరారీ),ఏ4) కె లోవ మాధవి(పరారీ),ఏ5)ముక్తేవి గిరీష్(అరెస్ట్),ఏ6)చావా శ్రీనివాస్(పరారీ),ఏ7)రమాకాంత్(పరారీ),ఏ8)కొమ్ము మురళి(అరెస్ట్)ల పై కేసులు నమోదు చేశామని ఏ ఎస్ పీ పేర్కొన్నారు.

Share it:

TS

Post A Comment: