చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: తేనెటీగల పెంపకం పై వారం రోజుల పాటు ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జెడ్పిటిసి కొణకండ్ల వెంకటరెడ్డి గిరిజన యువతకు సూచించారు. సోమవారం స్థానిక రైతు వేదిక నందు అండర్ నేషనల్ బాక్ కీపింగ్ అండ్ హ్యంగ్ మిషన్(ఎన్ బి హెచ్ ఎం ) ఆధ్వర్యంలో గిరిజన యువతకు తేనెటీగల పెంపకంపై వారం రోజుల శిక్షణను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తేనెటీగల ద్వారా సహజ సిద్ధమైన తేనె ఉత్పత్తి చేయడం ద్వారా యువతకు మంచి ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చున్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ విజయ్ బాబు, ఏఓ నవీన్ బాబు, నాగభూషణం, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: