చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: జూలూరుపాడు రోడ్డు అడ్డా ఆటో యూనియన్ అధ్యక్షులుగా నారాపోగు రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా కంపటి లక్ష్మయ్య లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలొ జరిగిన ఆటో డ్రైవర్ల విస్తృతస్థాయి సమావేశంలో కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతన కమిటీ బాధ్యులు మాట్లాడుతూ..ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి తమ వంతుగా ప్రయత్నం చేస్తామన్నారు.అధికారులతో కలిసి తమ సమస్యలను పరిష్కరించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ బాధ్యులు ఎండి హనీఫ్, ఇనుముల పిచ్చయ్య,రెడ్డిపోగు రవి,రామారావు,వెంకన్న, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: