CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసి ఆటల తల్లికి ఆర్థిక సహాయాన్ని అందించిన లేళ్ళ..

Share it:

 



మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, జనవరి 2, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు పంచాయతీ పరిధిలోగల బచ్చల కోయగూడెం, గ్రామానికి చెందిన బొర్రా శైలజ, పేద ఇంటి విద్యార్థి అయినపట్టికి ఎంతో పట్టుదలతో 2014వ సంవత్సరంలో నేషనల్ కబడ్డీ ఛాంపియన్ షిప్ కు ఎంపికై, మంచి గుర్తింపు తెచ్చుకొంది. ఆటల మీద మక్కువ ఉండటంతో కొన్ని రోజుల క్రితం కబడ్డీ ప్రాక్టీస్ చేస్తుండగా, శైలజ యొక్క ఎడమ కాలు లోని మోకాలు లీగ్మెంట్ విరిగి పోయింది. వైద్యులను సంప్రదించగా శాస్త్ర చికిత్స చేయాలి లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడంతో పేద కుటుంబంలో పుట్టిన శైలజ కాలు శస్త్రచికిత్స చేపించుకునే స్థోమత లేక ఇబ్బంది పడుతూ, దాతలెవరైనా ఉంటే ఆర్ధిక సహాయం చేయగలరని, పత్రికల ద్వారా, మిత్రుల ద్వారా, తెలిచేయడంతో, పడమట నర్సపురం గ్రామ తెరాస అధ్యక్షులు లేళ్ళ గోపాల్ రెడ్డి ఆదివారం, బొర్రా శైలజ స్వగ్రమం బచ్చల కోయగూడెం వెళ్లి, శైలజ ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని బాలికకు ఆర్ధిక సహాయాన్ని అంద చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. పేదింటి ఆటల తల్లి శైలజ గురించి వార్త తెలిసి, నావంతు సాయం చేస్తున్నాను, ఇలానే ఎవరైన దాతలు ముందుకొచ్చి శైలజ శాస్త్ర చికిత్స కొరకు చేతనైన ఆర్థిక సాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ బాధవత్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: