మన్యంటీవి, అశ్వారావుపేట:మండలంలో చాపకింద నీరులా కరోనా వైరస్ విస్తరిస్తుంది. దీంతో కోవిడ్ పాజిటివ్ రేట్ అమాంతం అధికం అవుతుంది. మండలంలోని మూడు ఆసుపత్రులు పరిధిలో 228 మందికి పరీక్షలు నిర్వహించగా 37 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
అశ్వారావుపేట సామాజిక ఆరోగ్య కేంద్రం, అశ్వారావుపేట వినాయక పురం, గుమ్మడవల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు వైద్యులు వెంకటేశ్వర్లు, రాంబాబు, హరీష్ లు తెలిపిన వివరాలు ప్రకారం సమాచారం.
గురువారం అశ్వారావుపేట (వినాయకపురం) ఆరోగ్య కేంద్రంలో 100 మందికి పరీక్షలు నిర్వహించగా (06) ఆరుగురికి,గుమ్మడవల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో 91 మందికి పరీక్షలు చేయగా (02) ఇద్దరికి,సామాజిక ఆరోగ్య కేంద్రంలో 37 మందికి పరీక్షలు చేయగా 29 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపారు. ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Post A Comment: