మన్యం టీవీ కరకగూడెం: మండల పరిధిలోని కన్నాయిగూడెం గ్రామానికి చెందిన ధర్మవరపు సత్యనారాయణ ఇటీవల కాలంలో జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో వారి నివాసానికి వెళ్లి పరామర్శించి, రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదివేల రూపాయలు అందజేశారు, అనంతరం కరకగూడెం గ్రామానికి చెందిన వనపర్తి రాంబాబు ఉ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం రేగ విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐదువేల రూపాయలను ట్రస్ట్ చైర్మన్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళికా, బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: