మన్యం మనుగడ పినపాక :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ సూచనల మేరకు
నేటి నుండి ఇంటింటికి "ఆరోగ్యం" కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి వి ఆర్ ఓ , ఆశ కార్యకర్త, అంగన్వాడి కార్యకర్త, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వీఆర్ఏ, గ్రామ స్థాయి అధికారుల తో ఇంటింటి సర్వే నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయి అధికారులు టీములుగా ఏర్పడి ఆ గృహ యజమాని తో పరిచయ కార్యక్రమంతో మొదలుపెట్టి ఆ గృహంలో నివసిస్తున్న వారి ఆరోగ్య పరిస్థితి పై వాకబు చేయడం జరుగుతుంది. ఆ గృహంలో ఎవరికైనా జ్వరాలు, జలుబు, దగ్గు, ఆయాసం, కోవిడ్ కి సంబంధించినటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా, అని తెలుసుకుని దానికి తగ్గ మందులను ఇవ్వడం జరుగుతుందని గ్రామాలలో సర్పంచ్ గ్రామ పంచాయతీ ద్వారా ప్రతిరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించబడుతుందని,
ఎం పీ డీ వో శ్రీనివాసులు, తాహసిల్దార్ విక్రమ్ కుమార్, ఎంపీవో బత్తిన శ్రీనివాసరావు, పినపాక మండల వైద్యాధికారి శివ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
Post A Comment: