గుండాల/ఆళ్లపల్లి జనవరి 22(మన్యం మనుగడ) ఎస్ ఎఫ్ ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫహిమ్ ధాదా మరియు మరికొందరి నాయకులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కోశాధికారి ఎం. ప్రశాంత్ డిమాండ్ చేశారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇల్లందు పట్టణంలో ఎస్ఎఫ్ఐ సమావేశాలు నిర్వహిస్తే మరుసటి రోజు వచ్చిన దిన పత్రికల ఆధారంగా కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. అక్రమంగా పెట్టిన కేసులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సందీప్, మహేష్ , నాగరాజు , కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: