కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి: జెడ్పీటీసీ పైడి వేంకటేశ్వరరావు మన్యం టీవీ న్యూస్ ,దమ్మపేట జనవరి ( 21 ) శుక్రవారం : సీఎం కేసీఆర్ ఆదేశానుసారం దమ్మపేట మండలం లో ఇంటి ఇంటికి జ్వరపీడితుల సర్వే కార్యక్రమాన్ని దమ్మపేట జడ్పిటిసి పైడి వెంకటేశ్వర రావు ప్రారంభించారు. దీనిలో భాగంగా శుక్రవారం గండుగలపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య సెంటర్ ను సందర్శించారు. ఆయన వెంట ఎంపీపీ సోయం ప్రసాద్ ,మండల మైనార్టీ సెల్ నాయకులు జిన్నా , సర్పంచ్ మడకం సుశీల, నాగ ప్రసాద్, ఎర్ర వసంతరావు మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: