CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వన దేవతలను దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు.

Share it:

 


మన్యం మనుగడ ములుగు 

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మేడారం వనదేవతలు సమ్మక్క సారక్క లను దర్శించుకుని రాష్ట్ర ప్రజలందరూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, కరోనా మహమ్మారి, ఓమిక్రాన్ లాంటి దుష్ట శక్తుల (వైరస్ )పీడ విరగడ అవ్వాలని తల్లులను కోరుకొని మొక్కులు తీర్చుకున్నారు. తదనంతరం మేడారం జాతరకు వచ్చే ప్రజలకు సౌకర్యాలు, ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల వసతి సౌకర్యాలు పర్యవేక్షించి అనంతరం అక్కడ జరుగుతున్న పనులపై సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాంతారావు మాట్లాడుతూ మేడారం లో నెలకొన్న దేవతలు సమ్మక్క -సారక్కలు ఎంతో మహిమ గల దేవతలని ప్రపంచం లో ఎక్కడ లేని విధంగా గిరిజన దేవతలకు గిరిజన సంప్రదాయంలో గిరిజన పూజారులతో తల్లులకు ఏ లోటు రాకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలతో అంగ రంగ వైభవంగా జరిగే మహాత్తర గిరిజన జాతర ఈ జాతరకు ఒక కోటి మంది వరకు భక్తులు వచ్చే వారు కానీ ఈ సారి కరోనా ఓమిక్రాన్ లాంటి వైరస్ వ్యాప్తి చెందకుండా భక్తులు స్వయం శ్రద్ద తీసుకొని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్లు ఉపయోగిస్తూ వనదేవత తల్లులను దర్శించుకోవాలి. మేడారం వచ్చే భక్తులు ప్రభుత్వం విధించిన నియమ నిభందనలు పాటిస్తూ తల్లులను దర్శనం చేసుకోవాలని భక్తులకు సూచనలు చేశారు.

Share it:

TS

Post A Comment: