CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అభాగ్యుల జీవితాలను నాశనం చేసినటువంటి వనమా రాఘవేంద్రరావును కఠినంగా శిక్షించి మరో కుటుంబం బలికాకుండా చూడాలి.తెలంగాణ బహుజన జేఎస్ నాయకుల డిమాండ్.

Share it:

  


ఖమ్మం : పాత పాల్వంచ నివాసి అయిన మండిగ నాగరామకృష్ణ కుటుంబ ఆత్మహత్యకు కారకుడైన వనమా రాఘవేంద్రరావును ఏ1గా నమోదు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా సత్వర న్యాయం జరిగేలా చూసి కఠినంగా శిక్షించి , మరో కుటుంబం బలి కాకుండా చూడాలని తెలంగాణ బహుజన జేఎస్ నాయకులు డిమాండ్ చేశారు . రాజకీయ పార్టీల అండదండలతో వనమా రాఘవేంద్రరావు ఆగడాలకు , అరాచకాలకు అదుపు , అడ్డు లేకపోయిందని , గతంలో కూడా చాలా కోకొల్లలు ఫిర్యాదులు ఉన్నాయని , విచ్చలవిడిగా బెదిరింపులకు పాల్పడుతున్నారని , అనేక కుటుంబాలు , ఎంతో మంది యువతులు అతనిచేత బలైనారని ఆరోపించారు .ఒక మాఫియా సామ్రాజ్యాన్ని తలపించేలా రాఘవ కొత్తగూడెం జిల్లాలో వ్యవహరిస్తున్నారని , ఇప్పటికైనా అతని దుర్మార్గాలకు ఆనకట్ట వేసి , వారి అనుచరులను , అతడిని కఠినంగా శిక్షించి ఆ ప్రాంత ప్రజలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని గుర్తుచేశారు . చాలా మంది జీవితాలను నాశనం చేసిన ఈ మానవ మృగాన్ని ఎన్కౌంటర్ చేయడం వల్ల వేరే వాళ్లకు ఇటువంటి హత్యా రాజకీయాలు చేయాలని ఆలోచన రాదని , ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా పారదర్శకంగా విచారణ జరిపించి కఠినంగా శిక్షించి , ప్రజల జీవితాలను కాపాడాలని కోరారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ బహుజన జేఎస్ గౌరవ సలహాదారు డాక్టర్ కెవి కృష్ణారావు , నాయకులు గుంతేటి వీరభద్రం , బానోత్ భద్రు నాయక్ , వల్లెపు సోమరాజు , యాదగిరి , దాసరి శ్రీనివాస్ , మందరాజు , నంధ్ర వెంకన్న తదితరులు పాల్గొన్నారు .

Share it:

TS

Post A Comment: