CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెలంగాణలో విద్య భవిష్యత్తు అంధకారమే.మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య.

Share it:

 



మన్యం వెబ్ డెస్క్:

కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నాణ్యమైన విద్య అందిస్తానని కేసీఆర్ నేడు కరోనా సాకుతో కేజీ నుంచి పీజీ వరకు విద్యాలయాలను మూసివేసి తెలంగాణ విద్యారంగ భవిష్యత్తును అంధకారం చేస్తున్నారని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈరోజు ఇల్లందు మండలం రోంపేడు గ్రామం లో జరిగిన పి డీ ఎస్ యూ కొత్తగూడెం డివిజన్ నిర్మాణ జనరల్ బాడీ పి డీ ఎస్ యూ డివిజన్ నాయకులు నరేంద్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ విద్యా సంస్థలకు మేలు చేసే విధంగా కేసీఆర్ ప్రభుత్వం కుట్రలు చేస్తూ కరోనా పేరుతో విద్యారంగాన్ని ధ్వంసం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.బార్ షాపులు, వైన్స్ ,సినిమా హాల్స్ ఓపెన్ చేసి కేవలం విద్యా సంస్థలు మాత్రమే మూసివేయడం దుర్మార్గమన్నారు.పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం చేసేందుకు పన్నాగం పన్నుతోంది.ప్రభుత్వం ఉన్నత విద్యారంగానికి నిధులు కేటాయింపుల విషయంలో ముందుకు రాని దుస్థితి నెలకొంది అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి పూనుకోవాలని ఆ వైపుగా పి డీ ఎస్ యూ విద్యార్థి ఉద్యమాలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి డీ ఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు శరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా ఉన్న ఉద్యోగాల సర్దుబాటు పేరుతో జీవో నెంబర్ 317 యాక్ట్ తీసుకొచ్చి ఉపాధ్యాయులను గందరగోళం చేస్తున్నారని దీనిని వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న ఉపాధ్యాయుల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్రపూరితంగానే విద్యాసంస్థలు మూసివేశారని తక్షణమే 317 యాక్ట్ ను సవరిస్తూ విద్యాసంస్థలు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.అదేవిధంగా ఈ కార్యక్రమంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి చండ్ర అరుణ పి డీ ఎస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కాంపాటి పృద్వి ,PDSU ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆజాద్ వెంకటేష్ పాల్గొని సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో పి డీ ఎస్ యూ కొత్తగూడెం డివిజన్ నాయకులు యనగంటి వంశీ ,పార్థసారథి,సాయి కుమార్ ,గుమ్మడి రవీనా, సాహితీ ,శృతి ,జబ్బా సురేష్ ,గణేష్ ,రేవంత్ , తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: