CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మేడారం జాతర పనులు పూర్తి చేయడంలో జిల్లా యంత్రాంగం విఫలం.డి.వై.ఎఫ్.ఐ జిల్లా అద్యక్షులు జాగటి.చిన్నా.

Share it:


మన్యం మనుగడ మంగపేట.

మంగపేట మండలంలో నేడు విలేకర్ల సమక్షంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) ములుగు జిల్లా అధ్యక్షులు జాగటి చిన్నా మాట్లాడుతూ జాతర సమయం కావస్తున్నా ఇప్పటికీ జాతర ఏర్పాట్లు పూర్తి చేయడంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఇప్పటికీ పస్రా నుండి మేడారం వరకు రోడ్డు మరమ్మతులు స్నానఘట్టాలు టాయిలెట్స్ లాట్రిన్స్ తదితర సంబంధిత పనులు పూర్తి కాలేదని వాగులో స్నానాల సందర్భంగా ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు.మేడారం లో ఎక్కడి సమస్యలు అక్కడె తిష్టవేసి ఉన్నాయని దీనివలన జాతరకు వచ్చే భక్తులకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మేడారం జాతర పేరు మీద కోట్లకు కోట్లు కేటాయించి పనులు పూర్తి స్థాయిలో చెయ్యకుండా నిధులు దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు రోడ్డుపై ఇసుక లారీలు విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం చేకూరుస్తున్నాయి అని సంబంధిత అధికారులు జాతర పూర్తయ్యేంతవరకు ఇసుక లారీల అనుమతిని రద్దు చేయాలని ఆయన సూచించారు సుదూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు మేడారం తో పాటు గట్టమ్మ రామప్ప లక్నవరం లాంటి పర్యాటక ప్రదేశాలను సందర్శితారని ఆయా ప్రాంతాల్లో ప్రజలకు రూట్ వే బోర్డు లు ప్రమాద హెచ్చరిక బోర్డు లు ఎర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు ఈ సమావేశంలో జిల్లా నాయకులు ఇందారపు రమేష్. మునగాల అంజి బాబు. మండల నాయకులు కేశవులు. గణేష్. సాయి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: