గుండాల/ఆళ్ల పల్లి జనవరి 19 (మన్యం మనుగడ) కష్టపడే వారిని పార్టీ ఎప్పుడు గుర్తిస్తుందని టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు కొమరం సతీష్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల కేంద్రానికి చెందిన సయ్యద్ ఆరిఫ్ ను నియోజకవర్గ యువజన విభాగం కార్యదర్శి గా నియమించినందుకు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కు ప్రత్యేక ధన్యవాదాలు అని ఆయన అన్నారు. మండలంలోని యువజన విభాగం నాయకులు అందరం కలిసి పార్టీ ఎదుగుదల కోసం తమవంతు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. యువజన ఈ విభాగం కోసం పనిచేసే వారిని గుర్తించి పదవులు వచ్చే విధంగా సహకరించిన టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు
Post A Comment: